HomeTelanganaNizamabadనవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా విద్యార్థి నాయకత్వ బాధ్యతల స్వీకారోత్సవం...

నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా విద్యార్థి నాయకత్వ బాధ్యతల స్వీకారోత్సవం…

నగరంలోని దాస్ నగర్‌లో గల నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థి నాయకత్వ బాధ్యతల స్వీకారోత్సవం (ఇన్వెస్టిచర్ సెరిమనీ) గురువారం ఘనంగా నిర్వహించారు.

నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బాధ్యతలు అప్పగించి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవాభావం ఎంతో ముఖ్యమని అన్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విద్యార్థులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ వికాసానికి తమ విద్యాసంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ సంతోష్ కుమార్, కరస్పాండెంట్ శ్రీదేవి నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్కూల్ కేబినెట్ సభ్యులు, వివిధ హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, స్పోర్ట్స్ కెప్టెన్లకు బ్యాడ్జీలు, సాష్‌లు, జ్ఞాపికలను అందజేసి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.

అనంతరం చైర్మన్ సంతోష్ కుమార్ విద్యార్థులతో నాయకత్వ ప్రతిజ్ఞ చేయించి, పాఠశాల గౌరవాన్ని కాపాడుతూ క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రమాణం చేయించారు.

విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయమైన మార్చ్‌పాస్ట్, క్రమశిక్షణతో కూడిన పరేడ్, నాయకత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, హెచ్‌ఆర్ డైరెక్టర్ లత, వైస్ ప్రిన్సిపాల్స్ సరత, సుధీర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన విద్యార్థి నాయకులను అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments