“రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం ప్రతి ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది” పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ,క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమంను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది గౌరవంగా తీసుకొని, సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా పోలీసులకు , సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను అందించి , రోడ్డు ప్రమాదాల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు.
ఈ శిక్షణతో రోడ్డు భద్రత మెరుగవడం, బాధితులకు న్యాయం కలగడం మరియు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఉపయోగపడే సమాచారం సేకరణ సాధ్యమవుతుంది అని అన్నారు.
కావున ఈ శిక్షణ సమయంలో నేర్చుకున్న ప్రతీ విషయాలను పోలీస్ స్టేషన్ లోని ప్రతీ సిబ్బంది కి తెలియజేయాలని తెలిపారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వరెడ్డి, ట్రాఫిక్ ఏ.సి.పి మస్తాన్ అలీ, ఈధర్ మేనేజర్ వర్షా నిహాంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో తదితరులు పాల్గొన్నారు.
