పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతినేలా మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరి కావనీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ.షకీల్ పాషా పేర్కొన్నారు.పోలీస్ వ్యవస్థ ఏ పార్టీకి బంధుత్వం లేదా పక్షపాతం చూపించదు, అది ప్రజలందరికీ సమానంగా శాంతిభద్రతలను కాపాడుతుందని పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలోనీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో పోలీసుల మనోదైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహరిస్తున్నారనీ పేర్కొన్నారు.
ఆగస్టు 14 న రాత్రి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ లోని యాసీన్ హోటల్ వద్ద ఫేస్బుక్ లైవ్ ద్వారా స్థానిక ఎస్హెచ్ఓ ను ఆ హోటల్ ఎందుకు బంద్ చేస్తున్నారని, పింకు బుక్కు యందు మీ పేరు ఎక్కిస్తానని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని బెదిరించినట్లు తెలిపారు.
విధి నిర్వహణలో భాగంగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో అన్ని ఎస్టాబ్లిష్మెంట్ లు బంద్ చేయిస్తున్నాము అందులో భాగంగానే పైన తెలిపినటువంటి హోటల్ మూసివేయించినట్లు తెలిపారు. పోలీసులు చట్టపరంగా ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఎస్టాబ్లిష్మెంట్ లను బంద్ చేయించడం జరిగింది.
అంతేకానీ దీనిపై మీరు పోలీసుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా పోలీస్ విధులను నీరు కార్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.అలాగే ఆగస్టు నెల 27 నుండి సెప్టెంబర్ నెల 8వ వరకు వినాయక విగ్రహ చవితి ప్రతిష్టపన నుండి నిమజ్జనం వరకు పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రత పరిరక్షణ భాగంగా ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా రాత్రింబవళ్లు చూసుకోవడం జరిగిందన్నారు.
కేవలం సుప్రీంకోర్టు తెలిపిన నిబంధనల ప్రకారం డిజె యొక్క హై వాల్యూం స్పీకర్ నిషేధించడం జరిగింది. కానీ మీరు పోలీసుల మనోసైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరెవరు డీజే సౌండ్ ను పై ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు.
కేవలం డీజే సౌండ్ యొక్క ఆంక్షలు అతిక్రమించిన వారిపై మేము కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీసులను టార్గెట్ చేస్తూ మా వారిపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని ప్రచారం చేస్తున్నారనే విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
దీనివల్ల పోలీసుల మనోదైర్యం దెబ్బతినే విధంగా మీ వాక్యాలు వున్నాయి. గత 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉంది పోలీసు వారి మీద మరియు వారి మనో దైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వాక్యాలుచేయడం సరికాదని అన్నారు.
అందుకు పోలీస్ అధికారుల సంఘం తరపున ఖండించారు. ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు చేయకూడదని పోలీస్ సంఘం తరపున విన్న విన్నవించారు. ఒకవేళ మీరు మళ్లీ ఇదే విదంగా వ్యవహరించినచొ పోలీస్ సంఘం తరపున చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
