ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సోమవారం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు బంజారాహిల్స్ లోని ఐసీసీసీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సిట్ అనేక మందిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన సిట్.. ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది.
ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉండగా.. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఒకసారి విచారణకు రావాలని నోటీసులివ్వగా.. అనివార్యకారణాలతో హాజరు కాలేకపోయినట్లు తెలిపారు.
దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి.. సిట్ అధికారులు ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వీరిద్దరూ చేసిన కంప్లైంట్ల ఆధారంగా సిట్ విచారణ చేసింది.
ఈ క్రమంలో సేకరించిన ఎవిడెన్స్ ను వారిద్దరి ముందు ఉంచి ప్రశ్నిస్తోంది. విచారణలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చే స్టేట్మెంట్ ను సిట్ రికార్డు చేయనుంది
