మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి, ఆంధ్రాకు పార్సల్ పంపిస్తాం. మా అస్తిత్వంపై దాడి చేస్తూ, మీ సంస్కృతిని మాపై రుద్దుతామంటే చూస్తూ ఊరుకోం.”తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేసారు చేశారు.
బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు- సాధన’ రౌండ్ టీబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు.ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి అని హెచ్చరించారు.
తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడనీ, అందునే ఇక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు ఒక కుట్ర ప్రకారం మన అస్తిత్వంపై దాడి చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, యాదగిరి లాంటి మేధావులు మాట్లాడితే ఆంధ్రా పోలీసులు వచ్చే ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు
