HomePOLITICAL NEWSNationalమరో సరి పెరిగిన ఎల్పీజీ గ్యాస్ .....

మరో సరి పెరిగిన ఎల్పీజీ గ్యాస్ …..

కేంద్రం మరోసారి గ్యాస్ సిలెండర్ ల ధరను అమాంతంగా పెంచేసేసింది. వాణిజ్య (కమర్షియల్) ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలెండర్ ధర ను యధావిధిగా కొనసాగించింది.

అమెరికా ఇరాన్ ల మధ్య వార్ మొదలైన తర్వాత ఇప్పటికే మూడు సార్లు ఎల్పీజీ గ్యాస్ ధర ను పెంచిన కేంద్రం సోమవారం మరోసారి పెంచింది. సవరించిన ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి..సిలిండర్ ధరపై రూ. 42 పెరిగింది. దీంతో అక్కడ సిలిండర్ రేట్ ఏకంగా రూ. 3,113 కు చేరింది.

దీనికి అదనంగా ఢిల్లీలో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను కూడా రూ. 11 పెంచారు. దీంతో దాని ధర రూ. 821లకు చేరింది.ఈ ధరల సవరణ ప్రభావం దేశంలోని ఇతర మెట్రో నగరాలపై కూడా తీవ్రంగా పడింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 53. పెరిగి.. రూ. 3,255కు చేరుకుంది.

ఇక మన హైదరాబాద్  లో   పెరిగిన రేటుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 3,357 గా ఉంది.గృహ వినియోగదారులు ఉపయోగించే దేశీయ (డొమెస్టిక్) ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాటి ధరలు యథాతథంగా కొనసాగుతుండటంతో సామాన్య ఇళ్లకు కాస్త ఊరట లభించినట్లయింది.

కానీ వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర పెంపు ప్రభావం పరోక్షంగా పేద మధ్య తరగతి ప్రజల మీద మోయ లేని భారం పడుతుంది హోటల్, టిపిన్ సెంటర్ నిర్వాహుకులు రేట్లను భారీగా పెంచారు రోడ్ల పక్కన నడిచే సెంటరు ల్లో కూడా టిఫిన్ ధరలు భారీగా పెరిగాయ్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments