గణేష్ నిమజ్జనం శోభాయాత్ర రాజకీయ రచ్చకు దారి తీసింది. బిఆర్ యస్ వర్సెస్ కమిషనర్ గా మారింది. ఏడు మాసాల క్రితమే వచ్చిన కమిషనర్ సాయి చైతన్య ను బిఆర్ యస్ టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
శోభాయాత్ర లో ఓ యువకుడు ఏకంగా జాతీయ నేత విగ్రహం మీద కూర్చొని డ్యాన్స్ చేసిన యువకుడు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం గులాబీ నేతల కు కోపం తెప్పించింది. కానీ కమిషనర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. రెండు రోజుల పూర్తీ స్థాయి విచారణ తరవాతే ఆ యువకుడిని కోర్టు కు తెచ్చారు.
అంతే ఏకంగాజిల్లాలో బిఆర్ యస్ మొదటి సారిగా పోలీస్ శాఖ ను టార్గెట్ చేసింది.కాంగ్రెస్ కు అనుబంధ విభాగంగా మారిందని
కేసీఆర్ పాటలకు స్టెప్పులేస్తే జైల్లో పెడతారా?.
నిజామాబాద్ సీపీ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోషియల్ మీడియా వేదికగా మండి పడ్డారు.కాంగ్రెస్ కనుసన్నల్లో పని చేస్తున్న మీకు కేసీఆర్ పాటకు ఆటాడటం ఘోరంగా కనిపించిందా? అని ఆయన నిజామాబాద్ సీపీని ప్రశ్నించారు..
‘అధికార పార్టీ అండదండలతో తెల్లార్లు పేకాట క్లబ్ లు జోరుగా నడుస్తున్నాయి.
ఎక్కడ పడితే అక్కడ మట్కా జూదమాడు తున్నారు. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి.
20ఏండ్లు నిండిన యువకులంతా గంజాయి మత్తులో ఊగుతుండ్రు.
నల్లమట్టి స్మగ్లింగ్ సాగుతోంది.వాటిని కంట్రోల్ చేయాలంటూ దెప్పి పొడిచారు.
సదురు యువకుడి నిర్బంధంపై ఎన్ హెచ్ ఆర్ సీ, జాతీయ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని ధమ్కీ ఇచ్చారు అంతకుముందు బిఆర్ యస్ కు చెందిన న్యాయవాదులు సైతం పోలీసుల అదుపులో ఉన్న యువకుడు కోసం ఆయా స్టేషన్ లను జల్లెడ పట్టారు. కానీ శోభాయాత్ర లో సదురు యువకుడు రోడ్ల మీద హంగామా చేయడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు.
అందులోను ఓ పోలీస్ అధికారి కొడుకే రోడ్డు మీద వీరంగం చేయడమే కాదుతోలి ప్రధాని నెహ్రు విగ్రహం మీద ఎక్కి ఆయన తలమీద కూర్చున్నాడు. పోలీసులు ఎంత వారించినా పట్టించుకోలేదు. దీనితో వీడియో తీసి సీపీ కు పంపారు ఆయన యువకుడు చేష్టలు చూసి ఆగ్రహం వ్యక్తం చేసాడు ఉన్నపలంగా లోపాయలని ఆదేశించారు
అసలే ఈసారి గణేష్ ఉత్సవాలను సీపీ ఛాలెంజ్ గా తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టడి చేశారు ముఖ్యంగా అల్లర్లకు పాల్పడే వారు రౌడీ షీటర్లను ను ముందే కట్టడి చేసారు తానే స్వయంగా బైండోవర్ పక్రియ ను చేపట్టారు.
శోభాయాత్ర లో తానే రంగంలోకి దిగి అనేక చోట్ల యువకులను మందలించి నిమ్మజ్జన పక్రియ ముందుకు సాగేలా చేసారు.కానీ ఆర్మూర్ లో ఓ యువకుడి అదికాక పోలీస్ అధికారి కొడుకేఇలా వ్యవహరించడాన్ని సీపీ సహజంగా నే కఠినంగా వ్యవహరించారు అదే గులాబీ నేతలకు గుస్సా తెప్పించింది
