నిజామాబాద్ నగరంలోని చంద్ర నగర్ కాలనీలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అమ్మవారి మండపానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కాలనీ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నవరాత్రి పూజలు విశేషంగా ఉండగా, ఈసారి కూడా భూమి పూజతో ఉత్సవాలకు శుభారంభం కావడం పట్ల కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
