HomeLaw and Orderనిజామాబాద్ అడిషనల్ కమిషనర్ గా ఎల్లారెడ్డి వాసి..--బొందుగుల చంద్రశేఖర్ గుప్త బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్ అడిషనల్ కమిషనర్ గా ఎల్లారెడ్డి వాసి..–బొందుగుల చంద్రశేఖర్ గుప్త బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా ఎల్లారెడ్డి కి చెందిన బొందుగుల చంద్రశేఖర్ గుప్త శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సంగీతం దిలీప్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా ఉన్న చంద్రశేఖర్ గుప్తను నిజాంబాద్ కు ప్రభుత్వం బదిలీ చేసింది. 9 నెలల పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా ఆయన పనిచేశారు.

అంతకుముందు సంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా, జిహెచ్ఎంసి లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఆయన పని చేశారు. ఎల్లారెడ్డికి చెందిన బొందుగుల చంద్రశేఖర్ గుప్త ఉన్నతమైన పదవి బాధ్యతలు చేపట్టడంపై స్థానికులు హర్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments