పీజు బకాయి లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిక్కనూర్ మండలం టిజివిపి ఆధ్వర్యంలో ధర్నా బుధవారం నిర్వహించారు
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా టీజీవీబీ అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి 7 కోట్ల 78 లక్షల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఖాళీగా ఉన్నటువంటి ఒక లక్ష 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అలాగే వెంటనే విద్య శాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు అలాగే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని స్థానిక బిక్కనూర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది
ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేనిపక్షంలో రాస్తారోకోలు మరియు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ ఖాన్ కార్యకర్తలు నిశాంత్ సందీప్ యోగేష్ తదితరులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు
