కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంబేద్కర్ ని, బడుగు బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటుందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ గావ్ చలో- బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పూలాంగ్ చౌరస్తాలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ను రాజకీయంగా, మానసికం గా ఎంతో క్షోభ కు గురి చేసి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సార్లు పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఓడించి,ఆయన చావు కి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు రాజ్యాంగాన్ని అవమానించిందని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అంబేద్కర్ కి భారతరత్న అవార్డు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మాత్రమే వచ్చిందనీ గుర్తు చేశారు.కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం మాది..కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం మాదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.కేటీఆర్ చెల్లె కవిత లిక్కర్ స్కామ్ లో సంచులు మోశారని, రేవంత్ రెడ్డి సైతం సంచులు మోసి వచ్చారని తెలిపారు. వాళ్లు సంచులు మోసే వాళ్లైతే మేము జాతీయ వాదం మోసేవాళ్ళమని పేర్కొన్నారు.ప్రభుత్వం పోయినా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బుద్ధి రావడం లేదని ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు..ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు
RELATED ARTICLES
