అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు.
అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సూపరింటెండెంట్ నవాజ్ ఖాన్, అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్ రావు,సిబ్బంది పాల్గొన్నారు.