కొత్త డీజీపీ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈసారి పోలీస్ బాస్ ఎంపిక ప్రభుత్వానికి కత్తి మీద సాముగా మారింది. నిబంధనల మేరకు సీనియార్టీ కి ప్రాధాన్యత ఇస్తారా ? లేదంటే ఎప్పటిలాగే విధేయత పట్టం కడుతారనేది ఐపిఎస్ వర్గాల్లో చర్చ నియాంశం అయింది.
కొత్త డిజిపి రేసులో ఐదారుగురు ఉన్నప్పటికి సీవీ ఆనంద్ శివధర్ రెడ్డి ల పేర్లే తుది పరిశీలన కు వచ్చే అవకాశం ఉంది. కానీ సీనియార్టీ ప్రాతిపదికగా నియామకం జరిగితే ఆనంద్ లేదా విధేయత వైపు సర్కార్ మొగ్గు చూపితే శివధర్ రెడ్డి నియామకం అవుతారు.
కానీ ఈసారి మాత్రం సీనియార్టీ కి అవకాశం ఇవ్వాలని మరోసారి జూనియర్ కు డిజిపి ఇవ్వద్దని ఆనంద్ ప్రభుత్వ పెద్దల వద్ద కోరుతున్నారు. ప్రస్తుతం డిజిపి జితేందర్ కూడా తనకంటే జూనియర్ అయినప్పటికి డిజిపి పోస్టు కట్టబెట్టడం ఫై అప్పట్లో ఒకరిద్దరు సీనియర్లు ఆక్షేపించారు.
కానీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి డిజిపి గా నియామకం అయినా జితేందర్ పదవీ విరమణ మరో అయిదు మాసాల్లో చేయబోతున్నారు. కానీ మూడు నెలల ముందే యూపీఎస్పీ కి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలిస్తోంది.
వీరిలో 1990 బ్యాచ్ కు చెందిన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా 1991 బ్యాచ్ కు చెందిన , హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. 1994 బ్యాచ్ కు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డికి , జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా. సిఐడీ డీజీ షికా గోయల్ ల పేర్లను,యూపీఎస్సీకి పంపే అవకాశం ఉంది .
యూపీఎస్సీ నిపుణుల కమిటీ నిర్దేశిత నియమావళి మేరకు డిజిపి కోసం ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాల్సి ఉంటుంది.
కానీ ఇందులో రవి గుప్తా వచ్చే ఏడాది డిసెంబర్ లోనే రిటైర్ అవుతున్నారు అందుకే ఆయన పేరు తుది పరిశీలనకు వచ్చే ఛాన్స్ లేదు అందులోనూ ఆయన కొంత కాలం డిజిపి గా పనిచేసారు కూడా ఆయన కు మరోసారి సారి అవకాశం రాదు.
సీవీ ఆనంద్ తో పాటు శివధర్ రెడ్డి ల తో పాటు షికాగోయెల్ సౌమ్య మిశ్రా ల లో ముగ్గురు పేర్ల ను యూపీఎస్పీ ప్రతిపాదించవచ్చు. కానీ ఫైనల్ గా ఎవరికి డిజిపి గా అవకాశం ఇవ్వాలనేది రేవంత్ సర్కార్ కు క్లిష్టంగా మారబోతుంది. ఇద్దరూ తెలంగాణ కు చెందిన వారే కావడం గమనార్హం ! సీనియార్టీ లెక్కన ఆనంద్ డిజిపిగా నియామకం కావాలి.
ఆయన 2028 జూన్ లో పదవీ విరమణ ఉంది. శాంతి భద్రత ల నిర్వహణలో అత్యంత కఠినంగా వుంటారు. అందులోనూ కీలకమైన పోస్టింగ్ ల్లో సమర్థవంతంగా పనిచేసారు. క్లిష్టసమయంలో ఆయన నగర కమిషనర్ గా రెండు సారి వచ్చి పరిస్థితులను ఇట్టే అదుపులోకి తెచ్చారు.
గతంలో తన కన్న జూనియర్ అయిన జితేందర్ కు డిజిపి గా నియామకం అయినప్పుడే ఆనంద్ నొచ్చుకున్నారు.అప్పుడే ప్రభుత్వ పెద్దలు నచ్చజెప్పారు.అందుకే ఈసారైనా సీనియార్టీ మేరకు తనకు డీజీపీ గా ఛాన్స్ ఇస్తారనే భరోసా తో ఉన్నారు కానీ రేవంత్ కు సన్నహితుడు గా ముద్ర ఉన్న ఇంటలిజెన్స్ డిజి శివధర్ రెడ్డి తాను వచ్చే యేడాది ఏప్రిల్ లో పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీ గా ఛాన్స్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నరు.
పదవీ విరమణ కు ఆనంద్ కు మరో రెండేళ్లు గడువు ఉన్నందున తన తరవాత ఆ అవకాశం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. కానీ మరోసారి జూనియర్ కు డిజిపి ఇవ్వడం పైనే విమర్శలు వెల్లు వేత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది.
నిజానికి ఏ ప్రభుత్వం కూడా డీజీపీ నియామకంలో నిబంధనలుపాటించడం లేదు సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదు.సీఎం లకు వీరవిధేయుడిగా ముద్ర ఉన్నవారే డిజిపి గా నియామకం కావడం ఆనవాయితీగా వస్తుంది. కెసిఆర్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. . ప్రస్తుత డీజీపీ జితేందర్‌ను కూడా యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేయలేదు.
సీనియారిటీ ప్రకారం రవిగుప్తా, ఆనంద్, ల కంటే జూనియర్ కానీ ఢిల్లీ స్థాయి లో పావులు కదిపి ఆ బాధ్యతల్లో వచ్చారు.అదీగాక ఆయన నియామకం రేవంత్ ఛాయిస్ కాదు అందుకే తనకు నమ్మకస్తుడైన శివధర్ రెడ్డి ని ఇంటలిజెన్స్ చీఫ్ గా నియామకం చేసుకున్నారు. జితేంధర్ డీజీగా ఉన్నా సరే శివధర్ రెడ్డి అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అందుకే ఈసారి డిజిపి విషయంలో రేవంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.