ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.
ఆదివారం నగరంలోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆద్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేస్తున్న సమయంలో బ్లాక్ అద్దాలున్న నాలుగు వాహనాలను గుర్తించి, ఆ ఫిల్మ్‌లను అక్కడికక్కడే తొలగించారు.
అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపినటువంటి 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.