2012 లో జరిగిన నియామకాలు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు ఫై తదుపరి చర్యల మీద యునివర్సిటీ అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు . ప్రసుతం యునివర్సిటీ లో కీలక స్థానం లో ఉన్న ఓ ప్రొపెసర్ ఈ వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.
హైకోర్టు తీర్పు ఇప్పటికిప్పుడే అమల్లో కి రాకుండా బాధిత ఉద్యోగులకు అభయ హస్తం ఇస్తున్నట్లు సమాచారం. మరో వైపు తమ ఉద్యోగాల తొలగింపు ను సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ కు వెళ్ళడానికి బాధితులు సన్నాహాలు చేస్తున్నారు.
డివిజన్ బెంచ్ ను ఆశ్రయించ నున్నారు. తదుపరి తీర్పు వచ్చేదికా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద స్టే వస్తుందనే ధీమాలో వారున్నారు.అప్పటిదాకా యునివర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త లు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా కీలక మైన విద్యార్థి సంఘాల నేతల తో బేరసారాలు సైతం మొదలు పెట్టారు.నిజానికి హైకోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి తాజా గా నోటిఫికేషన్ ఇవ్వాలి దీనితో చాల మంది ఔత్సహిక యువత కు ఉద్యోగ అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. కానీ గతంలో దొడ్డి దారిలో రోస్టర్ నియమావళి తుంగ లో తొక్కేశారు.
ఎంతో మంది అర్హులైన వారు ఉన్నాసరే నిబంధనలు పాతరేసి నియామకాలు చెప్పట్టారు. అందుకే తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో సీఎంవో సైతం రంగంలోకి దిగింది. అయినప్పటికి యునివర్సిటీ అధికారుల బరితెగించడం తో అర్హులైన అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు 2013 లో దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ బీమాపక నగేష్ ధర్మాసనం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది.
2012 లో అప్పటి వైస్ ఛాన్స్ లర్ అక్బరోద్దిన్ యూనివర్సిటి లో నియామకాలు చేపట్టారు. నియామకాలు భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ పిర్యాదు లు వెల్లువెత్తాయి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దాక వెళ్లాయి కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు అయినప్పటికి అభ్యర్థులకు నియామకం ఉత్తర్వ్యూలు ఇచ్చారు.
దీనితో నియామకాల ను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ వాదనలు జరిగాయి. నియామకాల్లో రోస్టర్ పాటించలేదని హైకోర్టు పేర్కొంది.
అయితే ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిబంధనలు తొక్కేశారని పిర్యాదు లు వెల్లు వెత్తాయి కానీ ఓ ప్రొపెసర్ తెరవెనుక మంత్రాంగం నడిపి వైస్ ఛాన్సలర్ ను ముందు పెట్టి పెద్దఎత్తున వసూళ్ల దందా కు తెరలేపి నియామక ఉత్తర్వ్యూలు ఖరారు చేసారు.
