సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరూ వ్యక్తులు గల్లంతయ్యారు. మల్లంపల్లి చెరువులో ద్విచక్ర వాహనం లభ్యమయింది.
నంబర్ ప్లేట్ ద్వారా ఓనర్ సమాచారాన్ని తెలుసుకునగా ఈసంపల్లి ప్రణయ్ పేరిట ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు .
