నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సుధాకర్ (48) తన TVS ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతడి వాహనాన్ని పెర్కిట్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.
