HomeTelanganaNizamabadజిల్లాకు మళ్ళీ మొండి చెయ్యేనా ……! మూడో సారి కూడా జిల్లాకు దక్కని బెర్త్ …..మరో...

జిల్లాకు మళ్ళీ మొండి చెయ్యేనా ……! మూడో సారి కూడా జిల్లాకు దక్కని బెర్త్ …..మరో విస్తరణ పై సుదర్శన్ రెడ్డి ఆశలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది. ముచ్చటగా మూడో సారి మంత్రి వర్గ విస్తరణ జరగబోతుంది. ఈసారి కూడా జిల్లాకు మొండి చెయ్యి ఇవ్వనున్నారు.

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాలుగో దఫా విస్తరణ పైనే ఆశలు పెట్టుకో నున్నారు. రెండో దఫా విస్తరణలో ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కింది. ఈసారి విస్తరణ లో ఒక్కరికే అవకాశం దక్క నుంది.

ఇక రేవంత్ క్యాబినెట్ లో రెండే మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. నాలుగో దఫా మంత్రి వర్గ విస్తరణ డిసెంబర్ నెలఖారు లో ఉండే ఛాన్స్ వుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రెండో దఫా విస్తరణలో ఎస్సి బీసీ వర్గాలకు మంత్రివర్గం అవకాశం ఇచ్చిన అధిష్టానం ఈసారి మైనార్టీ కోట ను భర్తీ చేసింది. మైనార్టీ వర్గాల నుంచి ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు లేక పోవడంతో ఇంత కాలం మంత్రి పదవి ఎవ్వరికి ఇవ్వాలనేది అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోయింది. మాజీ ఎంపీ అజారోద్దిన్ కు గవర్నర్ కోట లో ఎమ్మెల్సీ గా ప్రభుత్వం ఈపాటికే సిఫార్స్ చేసింది.

మంత్రి అయ్యాక ఆయన కు ఆరు మాసాల గడవు వుంటుంది. అయితే మూడో దఫా విస్తరణ లో కూడా జిల్లాకు మంత్రి మండలి లో ప్రాతినిధ్యం దక్కకపోవడం తో సర్వత్రా విస్మయానికి గురి అవుతున్నారు. రాష్ట్రం లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి వర్గం జిల్లాకు బెర్త్ దక్కుతూ వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటూ వచ్చారు. వై వైస్ క్యాబినెట్ లో షబ్బీర్ డీఎస్ లు మంత్రులుగా ఉంటే సురేష్ రెడ్డి స్పీకర్ అయ్యారు.

కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది.కానీ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యే లున్నారు. ఇందులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రి గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయినా ఎవ్వరికి మంత్రి పదవి దక్కక పోవడంపై పార్టీవర్గాలు రగిలి పోతున్నాయి.

సామజిక సమీకరణల వంక తో అసలు జిల్లాకు మంత్రి పదవి ని నిరాకరించడాన్ని పార్టీ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్ ఎమ్మెల్యే గా సుదర్శన్ రెడ్డి మంత్రి అవుతారని అంత భావించారు అందులోనూ సీఎం రేవంత్ సమీప బంధువు కూడా కావడంతో హోం లేదా విద్యా శాఖ దక్కనుందంటూ ఆయన సన్నిహితులు డంఖా బజాయించారు.

కానీ అనూహ్యంగా ఆయనకు క్యాబినెట్ మంత్రి ఇవ్వడానికి అధిష్టానం ససేమిరా అంది దీనితో తీవ్ర నిరాశకు గురైన సుదర్శన్ రెడ్డి చాలా రోజులు అసంతృప్తి తో రగిలిపోయారు. సీఎం రేవంత్ బుజ్జగించడమే కాదు విప్ పదవి ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు ఎహే విప్ వద్దే వద్దు మంత్రి కావాలి అంటూ బీష్మించారు.

దీనితో రేవంత్ రెడ్డి సైతం రెండో దఫా లో ఆయన కు మంత్రి పదవి ఇప్పించడానికి అధిష్టానం వద్ద పట్టు బట్టారు. రెండో దఫా లో అధిష్టానం సామజిక అస్రం ను తెరమీదికి తేవడంతో మరోసారి మంత్రి పదవి చేజారి పోయింది ఎలాగో క్యాబినెట్ లో మూడు ఖాళీలుండడంట్ మరో విస్తరణలో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గీయులు భరోసా తో ఉంటూ వచ్చారు

శుక్రవారం మరో సారి విస్తరణ జరిగింది కానీ ఈసారి కూడా సామజిక అస్రమే తెరమీదికి తెచ్చారు మైనార్టీ కోట ను భర్తీ చేశారు. ఇక రెండే మంత్రి పదవులు మిగిలాయి.రాబోయే విస్తరణ లో నైన క్యాబినెట్ జిల్లాకు ప్రాతినిధ్యం ఉంటుందా లేదా చూడాలి ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments