కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను నగర కమిషనర్ సివి ఆనంద్ అభినందించారు .
హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన దాదాపు 236 మంది పోలీసు సిబ్బంది 26 విభాగాల్లో పోటీపడి 9 ఓవరాల్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లతో పాటు 67 బంగారు, 32 రజత, 23 కాంస్య పతకాలను సాధించడం ఫై సివి ఆనంద్, ప్రశంసలు కురిపించారు పతక విజేతలను అభినందించారు పోలీసు విధులను సాగిస్తూ క్రీడలలో రాణించడానికి అవసరమైన అంకితభావం మరియు కఠినమైన శిక్షణను ఉండాలన్నారు .
, ముఖ్యంగా ఫైనల్స్‌లో ప్రదర్శించేందుకు ఎలాంటి ఒత్తిడిలోనైనా అవసరమైన మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని తెలిపారు.

రాబోయే ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారికి పూర్తి పరిపాలనా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో అదనపు డిసిపి భాస్కర్,.బి.కిష్టయ్య,కిషన్ రావులు పాల్గొన్నారు.
