నగరంలో శుక్రవారం జరగనున్న సార్వజనిక గణేశ్ శోభాయాత్రకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. వినాయకుల బావి, దుబ్బ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
శోభాయాత్ర సాగే మార్గంలో పోలీసుల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రధాన కూడళ్ల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలను సమీక్షించారు.
శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సజావుగా జరిగేలా పోలీసు శాఖ అన్ని భద్రతా చర్యలు చేపట్టిందని సీపీ తెలిపారు.
