HomeDevotionalఖైరతాబాద్‌ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్‌

ఖైరతాబాద్‌ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్‌

నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రను అత్యంత ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ తరఫున అన్ని రకాల పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌ తెలిపారు.

ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన సన్నాహాలను శనివారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అంతకుముందు పోలీస్ అధికారులతో కలిసి బడా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనంతో పాటు, బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగేలా చర్యలు చేపట్టామన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, జలమండలి సహా అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. బందోబస్తు నిమిత్తం దాదాపు 20 వేల మంది సిబ్బందిని విధుల్లోకి దించినట్లు వెల్లడించారు.శోభాయాత్రను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లోని దాదాపు 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీజీఐసీసీసీ)కు అనుసంధానించామని, అక్కడి నుంచే అధికారులు నిఘా ఉంచుతారని తెలిపారు.

మహిళలు, యువతుల భద్రతకు పెద్దపీట వేస్తూ మూడు షిఫ్టుల్లో 26 ‘షీ-టీమ్స్‌’ బృందాలు రద్దీ ప్రాంతాల్లో నిరంతరం విధుల్లో ఉంటాయన్నారు. నిమజ్జనోత్సవం సందర్భంగా నగర ట్రాఫిక్‌ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే ట్రాఫిక్‌ మార్గదర్శకాలను ప్రజలు గమనిస్తూ, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

నిమజ్జన పర్వాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా ముగించేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని.. నగర ప్రజలంతా శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments