HomeTelanganakamareddyఎంబీబీఎస్‌ విద్యార్థిని ప్రణతికి రూ.50 వేల ఆర్థిక సాయం

ఎంబీబీఎస్‌ విద్యార్థిని ప్రణతికి రూ.50 వేల ఆర్థిక సాయం

ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యను కొనసాగించేందుకు ఇబ్బంది పడుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థినికి హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ అండగా నిలిచింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కుమ్మరి ప్రణతి ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది.

ఆమె చదువుకు అయ్యే ఖర్చులో భాగంగా ఫౌండేషన్‌ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.అడిషనల్‌ కలెక్టర్‌ (ఎల్‌బీ), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రధాన కార్యదర్శి, హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎల్‌. రామన్‌రెడ్డి సంయుక్తంగా ప్రణతికి చెక్కును అందించారు.

బిచ్కుంద తహసీల్దార్‌ వేణుగోపాల్‌ సూచన మేరకు ఈ సహాయం అందించినట్లు తెలిపారు.ప్రణతి వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని రామన్‌రెడ్డి ఆకాంక్షించారు.

విద్యార్థుల ఉన్నత విద్యకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ఫౌండేషన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments