ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఆ బియ్యని ప్రభుత్వానికి ఇవ్వకుండా బయట అమ్ముకున్నటువంటి రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు .
అలాగే రూ 200 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించని వారిపై కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో కలిసి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కేటాయింపులో రాష్ట్రంలోనే నిజామాబాద్ టాప్ ఉందని తెలిపారు.రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లాలోని మొత్తం తొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అలాగే అత్యధికంగా 95 శాతం మేరకు వారి ధాన్యం కొనుగోలు జరిగిందని అందుకు సంబంధించిన అధికారులను అభినందించారు.
అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇసుకను ఎలాంటి పనులు చెల్లించకుండా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని అందుకు అధికారులు సహకరించాలని తెలిపారు.
ఇక నిజామాబాద్ లో నిరుద్యోగ యువతి యువకులు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ప్రకారం రూ 8 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని,అందులో ప్రభుత్వం 6 వేల కోట్లు,బ్యాంకు 2 వేల కోట్లు సబ్సిడీ అందిస్తుందని అన్నారు.
భూ భారతీ సంబంధించి పలు పైలెట్ మండలాలను ఎంపిక చేసి ఆ గ్రామంలో గత ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడిన సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టం అమలు చేసి రైతు సమస్యలు పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిపారు.
అందుకు ప్రభుత్య కలెక్టర్,సబ్ కలెక్టర్ l,ఆర్డిఓ తాసిల్దార్ ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి సర్వేలు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఇక వచ్చే ఖరీఫ్ సీజన్ కు రైతులకు విత్తనాలు, ఫార్టిలైజర్ వంటివి అందుబాటులో ఉంచేటట్లు ప్రభుత్యం చొరవ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, తాహిర్ బిన్ హందాని,ఎల్లారెడి ఎమ్మెల్యే,తదితరులు పాల్గొన్నారు.
