సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పడు కొత్త మార్గాల్లో డబ్బులు కాజేస్తున్నారు.ఈసారి ఏసీబీ అధికారులుగా అవతారం ఎత్తారు ఏకంగా ఓ తహశీల్ధార్ నే బోల్తా కొట్టించారు.
అవినీతి కేసులో అరెస్టు తప్పదని ధమ్కీ ఇచ్చి తహశీల్ధార్ నుంచి ఏకంగా రూ 3.30లక్షల నగదు ను కాజేశారు.ఈ ఘటన యాదాద్రి జిల్లా రాజాపేట లో జరిగింది తాను ఏసీబీ అధికారిని అంటూ తహశీల్దార్ దామోదర్‌కు ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది.
అవతలి వ్యక్తి గంబీరం అయినా గొంతు కావడం పైగా ఏసీబీ అధికారి అని చెప్పడంతో తహశీల్ధార్ కు సహజంగానే గాబరా పడ్డారు .అవినీతికి పాల్పడుతున్నావని తనకు పిర్యాదు లు వస్తున్నాయని త్వరలోనే అరెస్ట్ తప్పదన్న హెచ్చరించాడు.
ఇంకేముంది తహశీల్దార్ కు చెమటలు పట్టాయి మాటలు తడబడ్డాయి అంతే డబ్బుల కోసం ధమ్కీ మొదలైంది. మావాళ్లు నీకోసం వస్తున్నారు అంటూ ఏమంటావు అంటూ బేరం కోసం క్లూ ఇచ్చాడు. సరే ఎంతైనా ఇస్తా అంటూ ప్రాధేయ పడడం తహశీల్ధార్ వంతు అయింది.
బేరం మొదలయ్యింది.5 లక్షల వెంటనే ఆన్‌లైన్‌లో రూ.3.30లక్షలను తహశీల్దార్ దామోదర్ సదరు సైబర్ నేరగాడు ఇచ్చిన నెంబర్ కు బదిలీ చేసాడు.విషయం సన్నిహితులకు చెప్పడంతో అదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగం వారు చెప్పడంతో తహశీల్ధార్ హుటాహుటిన సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదుచేశారు.
దీనితో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.దర్యాప్తు మొదలు పెట్టారు. సామాన్య ప్రజానీకం సైబర్ నేరగాళ్ల ఉచ్చు లో పడొద్దంటూ పోలీసు శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తుంటే ఉన్నత స్థాయి లో ఉండే అధికారులే సైబర్ నేరగాళ్ల కు చిక్కడం గమనార్హం.
