కట్టుకున్న భర్తతో కలిసి ఓ కన్న కూతురు స్వంత తల్లిని హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ లో శుక్రవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..
బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త, ఒక కొడుకు కొన్నేళ్ల క్రితం చనిపోగా, మరో కొడుకు వేరే చోటు ఉంటున్నాడు. కాగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి విజయ 300 క్వార్టర్స్ లో ఉంటోంది.
విజయను తన భర్త తో కలిసి సౌందర్య గొంతు నులిమి హత్య చేసిందనీ తెలిపారు. ఆ తరువాత గుండెపోటు వచ్చి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే విజయ గొంతుపై గాయాలు ఉండడంతో స్థానికులు అనుమానంతో ఐదో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కూతురు సౌందర్య,రమేష్ ల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
