కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లాకు చెందిన..అలకుంటా సంపత్ (31) l. శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4 వ తేదీన రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ఈ మేరకు విచారణ పేరిట పోలిసులు చితకబాదినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆతరువాత 13 వ తేదిన సంపత్ ను వారి స్వంత ఇంటికి పంపినట్లు తెలిపారు.ఇంటికి వెళ్ళిన తర్వాత సంపత్ తన తమ్ముడైన సంజయ్ ,కుటుంబ సభ్యులకు తనను గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ లో ఘోరంగా కొట్టారని చెప్పాడని తెలిపారు.
తనని కొట్టిన విషయం బయట ఎక్కడ చెప్పిన మళ్ళీ వచ్చాక నీ సంగతి ఉంటుందని బెదిరించారని తెలిపారు. ఈ మేరకు 13 వ తేది సాయంత్రం యదావిధిగా నిజామాబాద్ కు చేరుకుని సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద కి వెళ్లినట్లు తెలిపారు.
ఈ క్రమంలో అర్థ రాత్రి 12 గంటల సమయంలో సంజయ్ కి ఫోన్ చేసి మీ అన్న గుండె పోటుతో మృతి చెందినట్లు తెలిపారనీ అన్నారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పోలీసులను నిలదీశారు.
తమ భర్త పోలిసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
