HomeCRIMEనగరంలో పది మంది జుదారులు అరెస్టు...

నగరంలో పది మంది జుదారులు అరెస్టు…

నగరంలో పేకాట స్థావరంపై దాడి చేసి పది జూదారులను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..

నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోనీ వీక్లీ బజార్, ముదిరాజ్ గల్లి లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ అంజయ్య పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వీరి నుంచి రూ 66,410 నగదు స్వాధీనం చేసుకున్నారు.అలాగే 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యలు నిమిత్తం నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments