ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మాక్లూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నందిపేట్ కు చెందిన నారాయణ (40).
ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తారు.గత రెండు నెలలుగా సస్పెన్స్ అయ్యి ఇంటి వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది.
అయితే బుదవారం వ్యక్తి గత పనులు నిమిత్తం నిజామాబాద్ వెళ్తున్న సమయంలో నిజామాబాద్ నుంచి నంది పేట్ వెళ్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
