HomeTelanganaNizamabadపెద్దాయన ను మురిపిస్తున్న మంత్రి ఆశలు …..దసరా లోపే విస్తరణ అంటూ సంబరపడ్డ అనుయాయులు …..కానీ...

పెద్దాయన ను మురిపిస్తున్న మంత్రి ఆశలు …..దసరా లోపే విస్తరణ అంటూ సంబరపడ్డ అనుయాయులు …..కానీ ఢిల్లీ నుంచి అందనిసంకేతాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది మాసాలు కావొస్తున్నా రేవంత్ క్యాబినెట్ జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నిలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ విజయ తీరాలకు చేర్చే వారేలేకుండా పోయారని అవేదన క్యాడర్ లో ఉంది.

జిల్లా కు మంత్రి వుంటేనే లోకల్ బాడీ ఎన్నికలల్లో సునాయాసంగా గట్టెక్కుతామని వాదన ఉంది. లేదంటే అసెంబ్లీ లోకసభ ఎన్నికల తరహా ఫలితాలే పునరావృత్తం ఖాయమని టాక్ క్యాడర్ నుంచి వస్తుంది.

క్యాబినెట్ విస్తరణ ఫై అదిగో …ఇదిగో అంటూ అధిష్టానం నెలల తరబడిగా ఎటూ తేల్చకుండా వ్యూహాత్మకంగా నాన్చుతుంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రి వర్గ విస్తరణ ఖాయమని హడావుడి జరుగుతున్నా అధిష్ఠానం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు.

కానీ ఈసారి దసరా పండగ కు ఓ రోజు అటుఇటుగా క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందంటూ కాంగ్రెస్ ముఖ్య నేతల్లో విసృతంగా ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా అదంతా ఉత్తదే అయ్యేట్లు ఉంది.

ఆశావహులకు మరోసారి భంగపాటు తప్పేలా లేదు.ఎవరి సంగతి ఎలా ఉన్న మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా జిల్లా నుంచి మాజీ మంత్రి దిగ్గజ నేత సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవీ ఖాయమని వాదన కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఉంది.

సుదర్శన్ రెడ్డి సైతం ఈసారి మంత్రి పదవికోసం పరితపిస్తున్నారు. కానీ క్యాబినెట్ విస్తరణ ఊసు వచ్చినా ప్రతిసారి ఆయన వర్గీయులు సంబర పడడం ఆపై డీలా పడిపోవడం షరా మామూలైంది.

మొన్నటి దాక మంత్రి పదవీ కోసం ఎదురు చూసిన సుదర్శన్ రెడ్డి వ్యూహాత్మకంగా సైడ్ అయ్యారు కానీ దసరా కు పక్కగా ఉంటుందని నేరుగా రేవంత్ నుంచే స్పష్టమైన సంకేతాలు వచ్చాయనే ప్రచారంఆయన సన్నిహితుల్లో నే జరిగింది.

దీనితో మౌనవ్యూహం వీడి పాలనా వ్యవస్థలో జోక్యం చేసుకున్నారు. కీలక వ్యవహారాల్లో అధికారుల తో సమావేశం అయ్యారు వారికి దిశానిర్దేశం చేయడం మొదలు పెట్టారు.

కలెక్టర్ కమిషనర్ లు ప్రోటోకాల్ పక్కకు తోసేసి ఆయన ఆదేశాలను అమలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికిఅధికార పార్టీకి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే లలో ఆయన ఒకరు.

కానీ అధికారులు మాత్రం క్యాబినెట్ స్థాయి హోదా ఉన్న వారితో ఎలా వుంటారో అలాగే సుదర్శన్ రెడ్డి తో వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలోనూ ఇరిగేషన్ ,వైద్యవిద్యా మంత్రి గా సమర్థ వంతంగా పనిచేసారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టిన ఖ్యాతి ఆయనకు ఉంది. పార్టీ అధికారంలో ఉన్న సరే ఇంకా పాలన వ్యవస్థ మెరుగు పడడం లేదనే ఆవేదన ఆయన కు ఉంది.

అందుకే ఎలాగైనా మంత్రి అయి కొరఢా ఝుళిపోయించాలనే తాపత్రయం తో ఉన్నారు. పార్టీ నేతలకు గత పదేళ్లుగా ఆయనే పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్నారు. అందుకే క్యాడర్ లో ను నిరాశా నిస్పృహ లో కనిపిస్తున్నాయి.

పార్టీ అధికారంలోకి రాగానే జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరే ఫైనల్ అయింది ఆయన కూడ రేవంత్ రెడ్డి తో పాటు తానూ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తాననే ధీమాతో ఉండే కానీ చివరిలో ఆయన కు అధిష్ఠానము స్పీకర్ బాధ్యతలు తీసుకోవాలని చెప్పడంతో ఖంగు తిన్నారు సున్నితంగా ఆ పోస్టు వద్దన్నారు.

కానీ విస్తరణ ఎప్పుడు జరిగినా ఈసారి తాను మంత్రి అవడం ఖాయమనే ధీమాతో ఉన్నారు అందుకే విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments