ధాన్యం కప్పకు నిప్పంటించిన రైతు..ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఓ రైతు వరి కుప్పకు నిప్పంటించాడు.
ఈ ఘటన బిక్కునూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బిక్కునూరు కు చెందిన ఓ రైతు వరి కోసి ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేస్తలేరని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్ని రోజులు అయినా సొసైటి సిబ్బంది,రాజకీయ నాయకులు తమ వ్యక్తులకు సంబంధించి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సామాన్య రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించారు.కనీసం సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు.
