HomePOLITICAL NEWSArmoorఆర్మూర్‌లో దొంగల ముఠా అరెస్ట్: 12.2 తులాల బంగారం, బైకులు, ట్రాక్టర్ స్వాధీనం - సిపి...

ఆర్మూర్‌లో దొంగల ముఠా అరెస్ట్: 12.2 తులాల బంగారం, బైకులు, ట్రాక్టర్ స్వాధీనం – సిపి సాయి చైతన్య ప్రెస్ మీట్‌లో వివరాలు

దొంగల ముఠా అరెస్ట్ -ఆర్మూర్ ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య -ఐదుగురు దొంగల అరెస్టు ,పరారీలో ఇద్దరు -12.2 తులాల బంగారు, రెండు బైకులు, ఒక ట్రాక్టర్ స్వాధీనం – కృషి చేసిన పోలీసు సిబ్బందికి సత్కరించిన సిపివరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఆర్మూర్ పోలీసులు పట్టుకున్నారు.

దొంగల ముఠాలోని మొత్తం ఏడుగురు నేరస్థులను అరెస్టు చేసిన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన ఏడుగురు గత కొన్ని రోజుల నుండి బ్రతుకుతెరువు నిమిత్తమై నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు.

కూలి పని చేయగా వచ్చే డబ్బులు వారి కుటుంబ పోషణ సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. మహారాష్ట్ర కు చెందిన శ్రీనివాస్, బాలాజీ, శ్రీనివాస్, అప్పారావు, విజయ్, బాబులు బొంగిలించిన 12 తులాల బంగారు నగలతో పాటు రెండు బైకులు, ఒక ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.

ఈ దొంగల ముఠా సభ్యులు దొంగిలించిన ఆటోలో వెనకాల కూర్చున్న మహిళలని టార్గెట్ చేసుకొని వారి మెడల నుండి బంగారు ఆభరణాలను దొంగిలించేవారు. ఆర్మూర్ ప్రాంతంలో రెండు, ముప్కాల్ లో ఒకటి, సారంగాపూర్ లో రెండు, బైంసా మండలంలో ఒకటి, మెట్పల్లి లో ఒకటి, జక్రాన్ పల్లిలో ఒక దొంగతనం చేసినట్టు వివరించారు.

అయితే మొత్తం ఏడుగురు దొంగల ముఠా కాగా ఐదుగురు అరెస్టయ్యారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందికి రివార్డులతో అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య , ఆర్మూర్ ఎసిపి జే. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ ఎస్ ఎస్ ఓ లు సత్య నారాయణ, శ్రీధర్ రెడ్డి, ఎస్సైలు వి. రజిని కాంత్ , రమేష్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments