నగరంలోని దుబ్బకు చెందిన దీపిక అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారాన్ని అందించారు.
గురువారం దీపికను అంబులెన్స్ లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది శివ దినేష్ సుఖ ప్రసవం చేశారు.
దీపిక పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. తమ బిడ్డకు ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బందికి దీపిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.