అనుమానాస్పదం గా వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం…
దర్పల్లి మండలంలోని దుబాక కు చెందిన వడ్ల రమేష్(49) నగరంలోని దుబ్బ లోని వసుద స్కూల్లో పక్కనే ఉన్న మురికి కాలువలో పడి మృతి చెందిన తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతికి గల కారణాలపై పోలీస్ లు ఆరా తీస్తున్నారు.