Saturday, June 14, 2025
HomeTelanganaNizamabadదళిత బంధు లో రా బంధువులు ...పది మంది నుంచి ముందే వాటాలు ..వెనక్కి...

దళిత బంధు లో రా బంధువులు …పది మంది నుంచి ముందే వాటాలు ..వెనక్కి ఇవ్వడానికి ససేమిరా లబోదిబో మంటున్న బాధితులు..నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో మాజీ సర్పంచ్ నిర్వాహకం ……పోలీసులను ఆశ్రయించిన బాధితులు

గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న దళిత బంధు లో లబ్ది జరగాలంటే వాటాల పేరుతొ గులాబీ ముఠాలుసాగించిన అరాచకాలుఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి.

నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో మల్కాపూర్ గ్రామంలో ఏకంగా పది మంది దళితుబంధు వచ్చేలా చేస్తానని ఓ మాజీ సర్పంచ్ ముందే పర్సెంటేజి వసూలు చేసి చేతులెత్తేశారు.

కానీ తమ నుంచి తీసుకున్న నగదు వాపస్ ఇవ్వాలని బాధితులు మాజీ సర్పంచ్ ను పదే పదే అడుగుతున్నా అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అంటూ బుకాయిస్తూ చివరికి డబ్బులు అడుగుతున్న బాధితుల మీద ఎదురుదాడికి తెగబడ్డాడు.

చివరికి చేసేది లేక బాధితులు మూకుమ్మడిగా నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ను వచ్చి తమ గోడు ను పోలీసులముందు వేళ్ళ బోసుకున్నారు. నిజామాబాద్ మండలం మల్కాపుర్ గ్రామానికి చెందిన నీరడి ప్రశాంత్ దళిత బంధు పథకం రెండవ విడుత కి అప్లై చేసుకున్నాడు.

ఈ విషయం తెలిసిన స్థానిక సర్మంచ్ బిఆర్ యస్ నేత బొడిగా ప్రవీణ్ గౌడ్ రంగంలోకి దిగాడు. దళిత బంధు పథకం వచ్చేలా చేస్తానని తనఅనుమతి లేకుండా ఎమ్మెల్యే శాంక్షన్ ఇవ్వరని ప్రశాంత్ ను బుకాయించాడు.

లేదంటే నువ్వు ఎన్ని రోజులు తిరిగిన నీకు దళిత బంద్ రాదు అని చెప్పడంతో నీరడి ప్రశాంత్ నిజమే అనుకున్నాడు. అంతే సర్పంచ్ ట్రాప్ లో వెళ్ళిపోయాడు ఇంకేముంది సర్మంచ్ బొడిగా ప్రవీణ్ గౌడ్ బేరం మొదలు పెట్టాడు.

లక్ష పదివేలకు బేరం కుదుర్చుకుని ముందుగానే డబ్బులు లాగేసాడు .ఇదే కాక మల్కాపుర్ గ్రామానికి చెందిన ఇంకో 12మంది కి కూడా ఇలానే దళిత బంధు ఇప్పిస్తానని బురిడీ కొట్టించాడు.

ఒక్కోరి నుంచి ముందుగానే పర్సెంటేజి వసూలు చేసాడు. గత ఎమ్మెల్యే వద్ద పనిచేసిన పిఎ కూడా సర్పంచ్ తో కుమ్మక్కు అయ్యారనేది గులాబీ శ్రేణులు చెప్తున్నాయి.

డబ్బులు ఇచ్చిన ప్పటికి దళిత బంధు పథకం తమకు మంజూరి కాకపోవడం తో పాటు ప్రభుత్వం మారిపోయింది. దీనితో దళిత బంధు స్కీమ్ ఫై బాధితులు ఆశలు వదులుకున్నారు.

దీనితో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలనిబాధితులు సర్పంచ్ డిమాండ్ చేశారు. రేపు మాపు అనుకుంటూ సర్పంచ్ బాధితులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నాడు. చివరికి వారంతా గ్రామ పెద్దమనుషులను ఆశ్రయించి గ్రామంలో పంచాయితీ పెట్టారు .

వారి జోక్యం చేసుకోవడంట్ మాజీ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ బాధితులకు తలా కొంత మొత్తం చెల్లించాడు. కానీ మిగితా వాయిదా ల్లో ఇస్తానని మాట ఇచ్చిన ఆ తర్వాత కథ మొదటి కి తెచ్చాడు సర్పంచ్.

కానీ తన భార్య డెలివరీ ఉందని వెళ్లి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేవంటూ బాధితుడు నీరడి ప్రశాంత్ గురువారం ఉదయమే సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ కు బ్రతిమిలాడాడు.

అందుకు సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ దుర్భాషలతో నీరడి ప్రశాంత్ పై దాడి చేసాడు. బాధితుడు లబోదిబో మంటు రూరల్ పోలీసు స్టేషన్ కు వచ్చి గురువారం లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసాడు.

అయితే స్టేషన్ లో ఇంకా గులాబీ బ్యాచ్ ఉండడంతో గుట్టుగా సెటిల్ చేసే పనిలో ఉన్నారు అక్కడి పోలీసులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!