తెలంగాణ విశ్వవిద్యాలయం, సారంగాపూర్ బీఈడీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి)గా పనిచేస్తున్న సువర్చల. ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. విజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఆమె పరిశోధనను పూర్తి చేశారు.
“ఎడ్యుకేషన్ ఏమాంగ్ రూరల్ డిస్అడ్వాంటేజ్డ్ క్లాస్ గర్ల్స్: ఏ స్టడీ ఆన్ స్కూల్ అడ్జస్ట్మెంట్ అండ్ అకడమిక్ పెర్ఫార్మెన్స్”(గ్రామీణ వెనుకబడిన వర్గాల బాలికలలో విద్య: పాఠశాల సర్దుబాటు మరియు విద్యా పనితీరుపై ఒక అధ్యయనం) అనే అంశంపై ఆమె సమర్పించిన థీసిస్‌కు గాను ఈ డాక్టరేట్ లభించింది.
ఈ సందర్భంగా ఎక్స్టర్నల్ ప్రొఫెసర్లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ డాక్టర్ జె. లలిత, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ కె. మూర్తి, డాక్టర్ దుర్గేషణ్, డాక్టర్ అనుపమలు సువర్చల పరిశోధనా పత్రాన్ని ప్రశంసిస్తూ, ఆమె డాక్టరేట్ పూర్తి చేసినట్లు ప్రకటించారు.
తన పరిశోధన పూర్తవడానికి సహకరించిన అధ్యాపకులకు, కుటుంబ సభ్యులకు సువర్చల కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సాధించిన ఈ ఘనత పట్ల సహచర అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
