ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్క రూ పాటించాలని ట్రాఫిక్ ఏసిపి నారాయణ సూచించారు.బుదవారం నిజామాబాద్ నగరంలోని ముబారాక్ నగర్ లో గల విజయ్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ ఏసిపి నారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..లైసెన్స్ లేని విద్యార్థులు వాహనాలు నడపరాదని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. రాంగ్ రూటు, సెల్ ఫోన్ డ్రైవింగ్ , త్రిబుల్ రైడింగ్ , అతివేగంగా వాహనాలు నడపరాదని,
ఇన్సూరెన్స్ లేని ఎలాంటి వాహనాలు కూడా నడపరాదని, హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదని హెచ్చరించారు.విద్యార్థులు,పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయకూడదని లైన్స్ దగ్గరే రోడ్స్ క్రాస్ చేయాలని వెల్లడించారు.
స్కూల్, కాలేజ్ లలో లైసెన్స్ లేకుండా విద్యార్థులు వాహనాలు నడపడానికి అనుమతి ఇవ్వరాదని స్కూల్ ప్రిన్సిపాల్ కు మరియు లెక్చరర్స్ కు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ, ట్రాఫిక్ సిబ్బంది,స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
