రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
బిర్కూర్ మండలంలోని బొమ్మనిదేవ్ పల్లి గ్రామానికి చెందిన జింక శ్రీకాంత్(36).భార్య పిల్లలు ఉన్నారు. పెయింటిన్ పనులు చేసుకుంటారు.గత మూడు సంవత్సరాల క్రితం నుంచి నిజామాబాద్ నగరంలోని జెండాగల్లి లో నివసిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై తరుచుగా భార్యతో గొడవ పడేవారు. ఈ క్రమంలో మద్యం తాగటం వద్దని మందలించినందుకు మంగళవారం అర్థరాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఎదురుగా వస్తున్న రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.