సమాజం కోసం పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని నిజామాబాద్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ కుమార్ అన్నారు. మే డే వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం డివిజన్ పరిధిలోని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. నగరం శుభ్రంగా ఉందంటే అది పారిశుద్ధ్య కార్మికుల కష్టం వల్లేనని కొనియాడారు. ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి 8వ డివిజన్ నాయకులు వరలక్ష్మి, మఠం రవి, విశ్వ సాయి, కుషాల్, బాబీ సింగ్, క్రాంతి మరియు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసి మే డే శుభాకాంక్షలు తెలిపారు.
