HomeTelanganaNizamabadకార్మిక చట్టాల రద్దుతో బానిసత్వమే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి, దేశ సంపదను...

కార్మిక చట్టాల రద్దుతో బానిసత్వమే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా నాయకులు ఎస్. సురేష్ విమర్శించారు. ..

140వ మేడే సందర్భంగా శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా హస కొత్తూర్, కమ్మర్‌పల్లి భగత్ సింగ్ చౌరస్తా, పార్టీ కార్యాలయం మరియు ఉప్పులూరు గ్రామాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి.

ఈ సందర్భంగా సురేష్‌తో పాటు పార్టీ నాయకులు డాక్టర్ సత్యనారాయణ, వి. సత్తెక్క మాట్లాడుతూ.. చికాగో వీధుల్లో కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం, ఇతర హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికులను ప్రశ్నించే హక్కు లేకుండా చేయడమేనని ధ్వజమెత్తారు.

దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాలపై దాడుల వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటి, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధాలను ఆపడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

హస కొత్తూరు: డాక్టర్ సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ పాల్గొన్నారు. భగత్ సింగ్ చౌరస్తా: రామాంజు ఎర్రజెండాను ఎగురవేశారు. పార్టీ కార్యాలయం: జిల్లా నాయకులు ఎస్. సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. ఉప్పులూరు: టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షురాలు వి. సత్తెమ్మ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాల్లో కమ్మర్‌పల్లి ఉపసర్పంచ్ అశోక్, నాయకులు వి. ఆనందు, ఎస్. లక్ష్మి, పెద్ది రాజేశ్వర్, వి. అశోక్, టి. బాలయ్య, ఖదీర్, గంగారాం, స్వామి, వి. రాధా, మౌలానా, పెద్ది కిషన్ గౌడ్, గౌరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments