HomeLaw and Orderనీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్...

నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్…

మే 3వ తేదీన జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరీక్షా కేంద్రాలను సందర్శించారు. డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూజీ బ్లాక్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు.

కట్టుదిట్టమైన బందోబస్తు మధ్యన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల్లోని ఆయా గదుల వివరాలను తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతితో పాటు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎం లను నియమించాలని ఆదేశించారు. అభ్యర్థులు కూడా తమ వెంట గాజు సీసాలలో మంచినీటిని తెచ్చుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

ఎండ తీవ్రత నుండి రక్షణ పొందేందుకు వీలుగా గొడుగులను కూడా తెచ్చుకోవచ్చని తెలిపారు. అయితే పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ చిన్న తప్పిదానికి సైతం అవకాశం లేకుండా నీట్ ప్రవేశ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని, సీ.సీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగాలని అధికారులకు సూచించారు.

మే 3వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు కొనసాగే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ భవనంలో, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూజీ బ్లాక్ లో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లో, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నిజామాబాద్ కంటేశ్వర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, మాక్లూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.

ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని అన్నారు. విద్యార్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోహాజరుకావాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంబంధిత అధికారులు ఉన్నారు.

అదనపు కలెక్టర్ సందర్శన కాగా, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేపథ్యంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments