కార్మికులు నిరంతరం సాగించిన పోరాటాల ఫలితంగానే నేడు అనేక హక్కులు, రక్షణ చట్టాలు అమలవుతున్నాయని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వైర్ మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ అన్నారు. మే డే వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని ఎల్లమ్మ గుట్టలో ఉన్న అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆయన జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కార్మిక లోకం పోరాడి సాధించుకున్న చట్టాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శ్రమకు తగ్గ గుర్తింపు, వృత్తిపరమైన భద్రత కోసం ఎలక్ట్రిషియన్లందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, అత్తర్ ఖాన్, ఫెరోజ్ అలీ పాల్గొన్నారు. వారితో పాటు టౌన్ కమిటీ అధ్యక్షులు రమేష్, రాజు, సంతోష్ మరియు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిషియన్లు పాల్గొని మే డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
