ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడం ఫై రైతాంగం ఆందోళన లతో రోడ్డెక్కుతున్నారు సోమవారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి )గ్రామం లో ధాన్యం కొనుగోలు చేయాలనీ రైతులు రహదారి పై బైఠాయించారు
20 రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రైతులు ఆగ్రహం తో రోడ్డెక్కడంతో రోడ్డుకు ఇరువైపుల రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు.నిలిచి పోయాయి తాము వడ్లు తీసుకొని ఎప్పుడు కొంటారా అని రోజుల తరబడిగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని తీవ్రమైన ఎండల లకు సొమ్మసిల్లి పోతున్నామని అదీగాక ఎప్పుడు వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితి వుందని ఆరుగాలం కష్ట పడి పండించిన వరి ధాన్యం వర్షం వస్తే తడిసి పోయి కోన లేని పరిస్థితి వుంటుందని వారు వాపోయారు.
మరో వైపు 20 రోజులుగా ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు అందుకే రోడ్డెక్కడం అనివార్యం అయిందన్నారు ప్రధాన రహదారి పై ధర్నాకు దిగటంతో ఇరు వైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు, తాసిల్దార్, సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. త్వరగా ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చూస్తామని హామి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు
