కరీంనగర్ నగరంలో జువెలరీ షాప్ లూటీ కేసులో దర్యాప్తు లో పురోగతి సాధించారు. దోపిడీ ముఠా వాడిన బైక్ దొరికింది. పల్సర్ బైక్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు సోమవారం లభ్యం అయింది.
కానీ ఆ బైకు కు మాత్రం కారు నెంబర్ ప్లేట్ తగిలించారు.సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు నిందితులు ఆ బైకును అక్కడే వదిలేసి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. పోలీసులకు దొరికిన బైక్ కు ఉన్న నెంబర్ ప్లేటు బలెనో కారుకు సంబంధించింది.
హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ను పల్సర్ వాహనాలకు ఉపయోగించారు. దొంగలు బీర్పూర్ – ధర్మపురి మార్గం గుండా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.. నిందితులు ధర్మపురి వద్ద గోదావరి నదిని దాటి, మహారాష్ట్ర సరిహద్దు వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు
