వాటర్ సప్లయ్, స్ట్రీట్ లైట్స్, గార్డెన్స్, ఫిల్టర్ బెడ్స్, శానిటేషన్ జవాన్లకు, వర్క్ ఇన్స్పెక్టర్ లకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19,500 ఇవ్వాలని గత సంవత్సరం నుండి మున్సిపల్ కమిషనర్, మేయర్, జిల్లా కలెక్టర్, కార్మిక అధికారులకు పలు దఫాలుగా వినతిపత్రాలు, ధర్నాలు చేయడం జరిగిందని
అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్ నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నదని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-, బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడే కానుకగా ప్రకటిచిన వెయ్యి రూపాయలను డ్రైవర్స్ వేతనాల నుండి కట్ చేస్తే డ్రైవర్స్ మెరుపు సమ్మెకు దిగడంతో వెయ్యి రూపాయలు తిరిగి చెల్లిస్తామని కమిషనర్ గారు చెప్పి దాదాపు సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఆవిషయంలో కార్పొరేషన్ నుండి
ఎలాంటి స్పందన లేదని వివరించారు.అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల రిపేర్ కోసం మెకానిక్ షెడ్ ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నా, కార్పొరేషన్ పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయలు ప్రైవేట్ వాహనాల షోరూం యాజమాన్యానికి బంగారు బాతుగా మారిందని ఆరోపించారు.
వర్ష కాలం రాబోతుందిని కార్మికులకు రేన్ కోట్లు, క్యాప్స్, షూ, గ్లాజ్ లు ఇతర పనిముట్లు ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్-BLTU ఆధ్వర్యంలో మే నెలలోనే వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.మొత్తం వర్ష కాలం అయిపోవచ్చింది గత 20 రోజులుగా ఔట్ సోర్సింగ్ కార్మికులు వర్షంలో తడుస్తూ విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని వాపోయారు.
మరోవైపు డ్రైవర్స్ పై వేదింపులు కొనసాగుతున్నారు.మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు రిపేర్ కు డ్రైవర్స్ కారణమంటున్న ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు దీంతో కొందరు డ్రైవర్లు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి వెంటనే ఇంజనీరింగ్, శానిటేషన్ నుండి ఇద్దరు అధికారులను నియమించి వెంటవెంటనే సమస్యలు పరిష్కరించడం ద్వారా కార్మికులకు మానసిక ఆందోళన తగ్గుతుంది, కార్పొరేషన్ కు పని సకాలంలో జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ వాటర్ సప్లయ్, గార్డెన్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైవర్స్, శానిటేషన్, జవాన్ల నాయకులు నవీన్ , ఎల్లయ్య, రాహుల్, హరీష్, మురళి, శ్రీశైలం, నవీన్, ప్రశాంత్, నందబాయి,
విజయ, విద్య, మోహన్ గౌడ్, కె. హరీష్,శంకర్, కె. సహాదేవ్, ఫెరోజ్ ఖాన్, రితేష్, నీరడి సాయిలు, కిరణ్,కె.వెంకట స్వామి, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.