నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో డీఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ మంగళవారం కమలాపూర్, మిట్టపల్లి రామడుగు, సుద్దపల్లి, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే తరగతి గదులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు.పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
విద్యార్థుల సామర్ధ్యాలను వెలికి తీసేందుకు టీచర్లు కృషి చేయాలని సూచించారు.విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, అప్పుడే వాళ్లకు చదువుపై ఆసక్తి పెరుగుతుందని చెప్పారు.
అలాగే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.





