కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి చౌరస్తా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ వి సోమిరెడ్డి తెలిపారు
మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కార్పియో వాహనంలో సుమారు 90 కిలోల 830 గ్రాముల గంజాయిని పాలకు తిరుపతి సత్నం అనే వ్యక్తులు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు
అలాగే శ్రీనివాస్ డప్పుశంకర్ వినోద్ లు పారిపోయారని వారిని త్వరలో పట్టుకుంటామన్నారు ఇటీవల ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున పట్టుకున్న కేసుల్లో ఇది అన్నారు కర్ణాటక మండలం నాగిని వద్ద నుంచి నాందేడ్లో స్థావరం ఏర్పాటు చేసుకొని అవసరమైన చోట్ల గంజాయిని తరలిస్తున్నారన్నారు స్కార్పియోతో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు 28 లక్షలు ఉంటుందన్నారు.
యువత గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. ఈ సమావేశంలో ఈఎస్ కామారెడ్డి హనుమంతరావు డిసిబి నిజామాబాద్ స్వప్న సుందర్ సింగ్ శరత్ అమిద్ మారుతి సందీప్ అభిషేక్ తదితరులున్నారు.
