HomeTelanganaNizamabadస్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పై వివరాలు ఇవ్వాలి..బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి..

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పై వివరాలు ఇవ్వాలి..బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి..

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల అమలు ప్రక్రియ, ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్ శాతం, బీసీ రిజర్వేషన్ల వివరాలను ఇవ్వాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నీ కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లను ఏ చట్టం లేదా నిబంధనల ప్రక్రియ ద్వారా అమలు చేస్తున్నారనీ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందనీ కోరారు.

2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణన చేయడం జరిగింది. ఈ కులగణన నివేదిక ఆధారంగా, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారనీ అన్నారు.

ఎస్సీ/ఎస్టీలకు బీసీ రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments