జిల్లా వ్యాప్తంగా మబ్బులు మూసురేశాయి. బుదవారం రాత్రి నుంచి జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది. దీంతో నగరం దాదాపు జలమయం అయింది. దీంతో భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి.
మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుదవారం నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షం 86.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
అత్య ధికంగా మెండోరా 8.4, కమ్మర్ పల్లి 7.9, డొంకేశ్వర్ 7.5, ముప్కాల్ 6.3,మోర్తాడ్ 5.2, బాల్కొండ,ఎర్గట్ల లలో 5.6, అత్యల్పంగా కోటగిరి, ఎడపల్లిలో 0 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు. భారీ వర్షాలొస్తే ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరమైతేనే వెళ్లాలని శాఖల వారీగా అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేశారు.
