HomeCRIMEమద్యం మత్తులో డయల్ 100కు ఫోన్....వ్యక్తికి ఒక రోజుల జైలు శిక్ష...

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్….వ్యక్తికి ఒక రోజుల జైలు శిక్ష…

నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100 కు ఫోన్ చేసిన వ్యక్తికి మంగళవారం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు రెండవ టౌన్ ఎస్ఐ యసీర్ అర్ఫత్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబన్ సహబ్ పహాడ్ కు చెందిన నదీం అనే వ్యక్తి మద్యం మత్తులో, ఆర్ ఆర్ చౌరస్తా నుంచి వెళ్తున్న మరో వ్యక్తి నుంచి ఫోన్ తీసుకొని 100కు డయల్ చేశాడు.

దింతో అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నెంబర్ కు కాల్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న నాదీం అనే వ్యక్తిని మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారించిన మెజిస్ట్రేట్ నాదీంకు ఒక రోజు జైలు శిక్ష విధించారు.

అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నంబర్ ను దుర్వినియోగం చేయకుండా ఆపదలో ఉన్నవారికి సహాయ పడే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎవరు కూడా అనవసరంగా పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని పలుమార్లు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ యశీర్ ఆర్ఫత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments