వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, USFI జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి అన్నారు.
PDSU,USFI,PYL,BSP విద్యార్థి ప్రజాసంఘాల ఆద్వర్యంలో నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో DCP గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత శనివారం రోజున ఉదయం హాస్టల్ బాత్రూంలో ఉరికి వేలాడుతూ మృతదేహం ఉందని,
కళాశాల ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రులు వచ్చేదాకా అవకుండా బోధన్ ఆసుపత్రికి తరలించరని,అదేవిధంగా విద్యార్థి చనిపోయే ముందు హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని టెక్నికల్ కారణాల వలన అది డిలీట్ అయిందని
కారణాలు చెప్పడం పలు అనుమానాలకు దారితీసిందని, మరియు విద్యార్థులకు పాఠాలు చెప్పే అనేకమంది మహిళా లెక్చరర్స్ ఉండగా పురుషులనే ఎందుకు వార్డెన్ గా నియమించారని,
లోపల ఏం జరిగిందో విషయాలను బయట చెప్పకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను అదే రోజు ఇంటికి పంపించడం మరిన్ని అనుమానాలకు దారితీసిందని,
కావున విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం,
నిన్న ఘటన వివరాలను తెలుసుకోవడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకుల పైన కేసులు నమోదు చేయడం జరిగింది వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల , ప్రజా సంఘాల నాయకులు నడిపింటి కార్తీక్ ,
వనమాల సత్యం, బండమీద నర్సయ్య, సిద్దల నాగరాజ్ , ప్రిన్స్,పోచమైన మహేష్, దేవిక, రవీందర్, రాకేష్, జవహర్, సురేందర్ పాల్గొన్నారు.
